-
-
Home » Andhra Pradesh » High Tension in Vizianagaram
-
విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2020-12-30T16:57:19+05:30 IST
ఏపీలో ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి.

విజయనగరం జిల్లా: ఏపీలో ఆలయాలపై వరుస దాడులు కలకలం రేపుతున్నాయి. తాజాగా రామతీర్థంలోని బోడికొండపై సుమారు 400 ఏళ్ల నాటి శ్రీరాముడి విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేసి తల భాగాన్ని వేరుచేసి ఎత్తుకెళ్లారు. దీంతో విజయనగరం జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ప్రభుత్వంలో హిందూ ఆలయాలకు రక్షణ లేకుండా పోతుందంటూ భక్తులు, విపక్షాలు మండిపడుతున్నాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే రామతీర్థం ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయినట్లు సమాచారం.
మంగళవారం ఉదయం గుడి పూజారి వెళ్లేసరికి ఆలయం తలుపులకు తాళం లేకపోవడంతో అధికారులకు సమాచారం అందించారు. వారిచ్చిన సమాచారంతో నెల్లిమర్ల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అందరూ కలిసి ఆలయం లోపల పరిశీలించగా శ్రీరాముడి విగ్రహం తల భాగం తెగి ఉండడాన్ని గుర్తించారు. తల భాగం కోసం పరిసరాల్లో వెదికినా కనిపించలేదు. దర్యాప్తు కోసం ప్రత్యేక పోలీస్ బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రాజకుమారి తెలిపారు.