గుంటూరులో కరోనా పాజిటివ్ నేపథ్యంలో తీవ్ర ఆందోళన..
ABN , First Publish Date - 2020-03-27T16:07:28+05:30 IST
గుంటూరు: గుంటూరులో ఓ పాజిటివ్ కేసు నేపథ్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా పాజిటివ్ వ్యక్తితో పాటు పలువురు ఢిల్లీ వెళ్ళి వచ్చారు.
గుంటూరు: గుంటూరులో ఓ పాజిటివ్ కేసు నేపథ్యంలో తీవ్ర ఆందోళన నెలకొంది. కరోనా పాజిటివ్ వ్యక్తితో పాటు పలువురు ఢిల్లీ వెళ్ళి వచ్చారు. వారిలో జిల్లాలోని పలు ప్రాంతాల వారున్నారు. మాచర్లకు చెందిన 8 మంది, మాచవరం మండలం పిన్నెల్లి ఒకరు, తెనాలి నుంచి ఒకరు, పిడుగురాళ్లలో ఇద్దరున్నారు. అంతేకాకుండా పాజిటివ్ వ్యక్తి గుంటూరు, తాడికొండలలో నిర్వహించిన మతపరమైన ప్రార్దనలలో పాల్గొన్నాడు. పాజిటివ్ బాధితుడితో కలిసి తిరిగిన వారు స్వచ్ఛందంగా చికిత్సలకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.