రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని హైకోర్టుకు తెలిపిన ఏజీ

ABN , First Publish Date - 2020-04-24T17:47:38+05:30 IST

అమరావతి: రాజధాని తరలింపుపై జేఏసీ హైకోర్టులో పిల్‌ను వేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది.

రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని హైకోర్టుకు తెలిపిన ఏజీ

అమరావతి: రాజధాని తరలింపుపై జేఏసీ హైకోర్టులో పిల్‌ను వేసిన విషయం తెలిసిందే. దీనిపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. రాజధానిని విశాఖకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని పిటిషనర్‌ పేర్కొన్నారు. అయితే రాజధాని వికేంద్రీకరణకు ఉద్దేశించిన బిల్లులు పాస్‌ అవ్వకుండా.. రాజధాని తరలింపు ప్రక్రియ చేపట్టబోమని ఏజీ హైకోర్టుకు తెలిపారు. ఇదే విషయంతో ప్రమాణ పత్రం దాఖలు చేయాలని ఏజీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా.. ప్రమాణపత్రం దాఖలుకు 10 రోజుల సమయం కావాలని ఏజీ కోరారు. దీంతో హైకోర్టు 10 రోజుల గడువిచ్చింది. 


కేంద్రం కూడా అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోపు రాజధాని తరలింపుపై ఎలాంటి చర్యలు తీసుకున్నా.. ధర్మాసనం దృష్టికి తీసుకురావాలని పిటిషనర్లకు హైకోర్టు తెలిపింది. రాజధాని తరలింపును ఆపడం ఎవరి తరమూ కాదని.. విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి పిటిషనర్ తీసుకొచ్చారు. పిటిషనర్‌ లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఏజీని కోరింది. కాగా.. అమరావతి పరిరక్షణ సమితి తరపున కార్యదర్శి గద్దె తిరుపతి రావు పిటిషన్ వేశారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఉన్నం శ్రవణ్ కుమార్ వాదించారు.

Updated Date - 2020-04-24T17:47:38+05:30 IST