-
-
Home » Andhra Pradesh » high court stays on arrest of ayyanna pathrudu
-
అయ్యన్న పాత్రుడు అరెస్టుపై హైకోర్టు స్టే
ABN , First Publish Date - 2020-06-22T21:54:19+05:30 IST
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది.

అమరావతి: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అరెస్టుపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. తనపై పెట్టిన నిర్భయ కేసు కొట్టివేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. నర్సిపట్నం మున్సిపల్ కమిషనర్‌ను దూషించారంటూ ఆయనపై కేసు నమోదైంది. అయ్యన్నపై నమోదైన ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులో హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చినరాజప్పలపై నమోదైనా అట్రాసిటి కేసుపై హైకోర్టు విచారణ జరిపింది. వారిని అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది.