శివానందరెడ్డి పిటిషన్‌కు అనుమతిచ్చిన ఏపీ హైకోర్టు
ABN , First Publish Date - 2020-10-08T23:39:28+05:30 IST
న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి ఇచ్చిన పిటిషన్‌ను హైకోర్టు

అమరావతి: న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వచ్చిన వ్యాఖ్యలపై మాజీ పోలీస్ అధికారి శివానందరెడ్డి ఇచ్చిన పిటిషన్‌ను హైకోర్టు అనుమతించింది. శివానందరెడ్డి పిటిషన్‌లోని ఆధారాలను.. హైకోర్టు నియమించబోయే దర్యాప్తు సంస్థకు అప్పగించాలని సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్‌కు న్యాయస్థానం ఆదేశించింది. దర్యాప్తు సంస్థ అధికారులు నేరుగా శివానందరెడ్డిని కలిసి.. వివరాలు తీసుకోవచ్చని ధర్మాసనం సూచించింది. ఆధారాలన్నింటినీ దర్యాప్తు సంస్థకు పూర్తిస్థాయిలో అందించాలని సీనియర్ న్యాయవాది మురళీధర్‌కు హైకోర్టు సూచించింది. దీంతో తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది.