మిషన్ బిల్డ్ ఏపీ అధికారిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం..

ABN , First Publish Date - 2020-12-30T19:11:18+05:30 IST

అమరావతి: మిషన్‌ బిల్డ్‌ ఏపీపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిక్విజల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది.

మిషన్ బిల్డ్ ఏపీ అధికారిపై కేసు నమోదుకు హైకోర్టు ఆదేశం..

అమరావతి: మిషన్‌ బిల్డ్‌ ఏపీపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. రిక్విజల్ పిటిషన్‌పై హైకోర్టు తీర్పును వెలువరించింది. తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన మిషన్‌ బిల్డ్‌ అధికారి... ఐఏఎస్‌ ప్రవీణ్‌పై కేసు నమోదు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు అఫిడవిట్‌ సమర్పించడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కారం అభియోగాల కింద కేసు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. క్రిమినల్‌ ప్రాసిక్యూషన్‌ కింద కేసు దాఖలుకు రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు ఆదేశించింది. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. ప్రభుత్వం న్యాయ ప్రక్రియలో జోక్యంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. తాను చేయని వ్యాఖ్యలను చేసినట్టుగా పిటిషన్‌ వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. Updated Date - 2020-12-30T19:11:18+05:30 IST