‘ఆది’కి భద్రత కల్పించడానికి ఇబ్బందేంటి?

ABN , First Publish Date - 2020-07-15T09:25:50+05:30 IST

మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్రప్రభుత్వానికి ఉన్న

‘ఆది’కి భద్రత కల్పించడానికి ఇబ్బందేంటి?

  • ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..
  • తదుపరి విచారణ 21కి వాయిదా

అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి సి.ఆదినారాయణరెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్రప్రభుత్వానికి ఉన్న ఇబ్బందేమిటో చెప్పాలని హైకోర్టు రాష్ట్ర పభుత్వాన్ని ప్రశ్నించింది. భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని పిటిషనర్‌ చెబుతున్నారని, ఈ వ్యవహారంలో ఎల్లోబుక్‌ నిబంధనలతో పాటు పూర్తి వివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 21వ తేదీకి వా యిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ కె.లలితతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది. తనకు కల్పిస్తున్న భద్రతను రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆదినారాయణరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. సింగిల్‌ జడ్జి గతంలో ఆయన పిటిషన్‌ను తిరస్కరించారు. దీనిపై ఆయన అప్పీలు చేయగా మంగళవారం విచారణ జరిగింది.

Updated Date - 2020-07-15T09:25:50+05:30 IST