హైకోర్టు ఉత్తర్వులు.. పలుకుబడిగల వ్యక్తులకే!

ABN , First Publish Date - 2020-09-20T09:17:14+05:30 IST

రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పలుకుబడిగల వ్యక్తులకు ప్రయోజనం కల్పించేలా

హైకోర్టు ఉత్తర్వులు.. పలుకుబడిగల వ్యక్తులకే!

లోక్‌సభలో వైసీపీ ఎంపీ లావు వ్యాఖ్యలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి విషయంలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు పలుకుబడిగల వ్యక్తులకు ప్రయోజనం కల్పించేలా కనిపిస్తున్నాయని వైసీపీ నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లోక్‌సభలో పేర్కొన్నారు. రాజధాని భూములపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయ న లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడుతూ.. అమరావతి రైతుల ప్రయోజనాలను కాపాడుతామన్నారు. రాజ్యసభలోనూ వైసీపీ సభ్యులు అమరావతి భూములపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ఈ మేరకు పిల్లి సుభాశ్‌ చంద్రబోస్‌, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డిలు రాజ్యసభలో మాట్లాడారు. కాగా, న్యాయమూర్తులకు సంబంధించి శుక్రవారం లోక్‌సభలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో అభ్యంతరకరమైన పదాలను స్పీకర్‌ ఓం బిర్లా రికార్డుల నుంచి తొలగించారు.  

Updated Date - 2020-09-20T09:17:14+05:30 IST