కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి

ABN , First Publish Date - 2020-10-21T08:24:30+05:30 IST

ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో సీట్లు కుదించడంపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి కోర్టుకు హాజరై వివరణ

కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వండి

ప్రైవేటు కాలేజీల్లో సీట్ల కుదింపుపై అధికారులకు హైకోర్టు ఆదేశం


అమరావతి, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి): ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో సీట్లు కుదించడంపై విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి, ఇంటర్మీడియెట్‌ బోర్డు కార్యదర్శి కోర్టుకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డి.రమేశ్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరానికిగాను సీట్లను కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. కొన్ని ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ పిటిషన్లపై మంగళవారం న్యాయమూర్తి ముందు విచారణ జరగ్గా, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు. 

Updated Date - 2020-10-21T08:24:30+05:30 IST