ఫిర్యాదు చేయాలంటే అఫిడవిట్ వేయాల్సిందే
ABN , First Publish Date - 2020-10-21T08:23:41+05:30 IST
దిగువస్థాయి న్యాయవ్యవస్థలోని సిబ్బందిపై ఫిర్యాదు చేయాలంటే అఫిడవిట్ వేయాల్సిందేనని అదేవిధంగా సదరు ఫిర్యాదులకు బలం

దిగువ స్థాయి న్యాయవ్యవస్థ సిబ్బంది వ్యవహారంలో హైకోర్టు ఉత్తర్వు
అమరావతి, అక్టోబరు 20(ఆంధ్రజ్యోతి): దిగువస్థాయి న్యాయవ్యవస్థలోని సిబ్బందిపై ఫిర్యాదు చేయాలంటే అఫిడవిట్ వేయాల్సిందేనని అదేవిధంగా సదరు ఫిర్యాదులకు బలం చేకూర్చే ఆధారాలు ఉండాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. లేనిపక్షంలో అలాంటి ఫిర్యాదు పరిగణనలోకి తీసుకోబోమని, ఎలాంటి చర్యలు కూడా ఉండబోవని పేర్కొంది. అయినప్పటికీ వ్యవస్థ ప్రయోజనార్థం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన విచక్షణాధికారం మేరకు సదరు ఫిర్యాదుపై ప్రాథమిక విచారణకు ఆదేశించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్(నియామకాలు)(ఎ్‌ఫఏసీ విజిలెన్స్) సునీత ఉత్తర్వులు జారీ చేశారు.