-
-
Home » Andhra Pradesh » high court notices to the ap Govt
-
ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
ABN , First Publish Date - 2020-11-27T20:25:58+05:30 IST
విశాఖపట్టణంలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

అమరావతి: విశాఖపట్టణంలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడ కొండపై అతిథి గృహ నిర్మాణం చేపట్టవద్దని అమరావతి జేఏసీ నేతలు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం న్యాయస్థానం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున న్యాయవాది మురళీధర్ వాదనలు వినిపించారు. గ్రే హాండ్స్‌కి ఇచ్చిన స్థలంలో అతిథి గృహం ఎలా నిర్మిస్తారని ప్రశ్నిస్తూ..వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో కేంద్రాన్ని కూడా పార్టీ చేయాలని పేర్కొంది. అలాగే గెస్ట్ హౌస్‌కు కేటాయించిన 30 ఎకరాల్లో చెట్లు కూడా నరకవద్దని ఆదేశించింది.