మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-09-18T22:02:34+05:30 IST
గుంటూరు: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలని సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు.

గుంటూరు: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ ఆస్తుల విక్రయాలు ఆపేయాలని సామాజిక కార్యకర్త సురేష్ పిల్ దాఖలు చేశారు. విచారణ అక్టోబర్ 16కు ధర్మాసనం వాయిదా వేసింది. ప్రతి పనికి అడ్డు తగులుతున్నారని, పరిపాలన కూడా వారినే చేసుకోమనండని ఏఏజీ వ్యాఖ్యానించారు. ‘మీరు ఎవరిని ఉద్దేశించి అన్నారు ...? హైకోర్టు నా..? పిటిషనర్లనా’ అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అన్నింటిపై విచారణ చేసి తీర్పును అక్టోబర్ 16న వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది.