మంగళగిరి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
ABN , First Publish Date - 2020-10-29T02:05:11+05:30 IST
మంగళగిరి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు నమోదు చేశారు.

గుంటూరు: మంగళగిరి పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ ముగ్గురిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఏ-2 వేణును అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్‌కు పంపారు. ఏ-1, ఏ-3 విషయంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలైంది. ఏ-2 వేణు అరెస్ట్‌కు ముందు 41(ఏ) నోటీసు ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు పోలీసులను ప్రశ్నించింది. మంగళగిరి పోలీసులు, జూనియర్ సివిల్ జడ్జిపై.. కోర్టు ధిక్కరణ కింద ఎందుకు తీసుకోకూడదని న్యాయస్థానం ప్రశ్నించింది. చర్యలను తీర్పులో వెల్లడిస్తామని హైకోర్టు పేర్కొంది.