మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-12-28T21:34:49+05:30 IST

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే రిక్విజల్ పిటిషన్‌పై కూడా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు

మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ

అమరావతి: మిషన్ బిల్డ్ ఏపీపై హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే రిక్విజల్ పిటిషన్‌పై కూడా న్యాయస్థానంలో విచారణ జరిగింది. ప్రభుత్వం, పిటిషనర్ల తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. తాము చేయని వ్యాఖ్యలు చేసినట్టుగా.. అఫిడవిట్‌లో పేర్కొనడంపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం తెలిపింది. పత్రికల్లో వచ్చాయని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. ఎక్కడొచ్చాయో చూపించాలని పిటిషనర్ల తరపు న్యాయవాదులు వాదించారు. విచారణ నుంచి తప్పుకోవాలని కోరుతూ ప్రభుత్వం వేసిన రిక్విజల్ పిటిషన్‌పై ఉత్తర్వులను న్యాయస్థానం రిజర్వ్ చేసింది.

Updated Date - 2020-12-28T21:34:49+05:30 IST