డా.రమేష్‌బాబును విచారించేందుకు అనుమతించిన హైకోర్టు

ABN , First Publish Date - 2020-11-27T18:07:59+05:30 IST

అమరావతి: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ క్వారంటైన్ సెంటర్ దగ్ధం కేసులో హైకోర్టు నేడు విచారణ నిర్వహించింది.

డా.రమేష్‌బాబును విచారించేందుకు అనుమతించిన హైకోర్టు

అమరావతి: స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ క్వారంటైన్ సెంటర్ దగ్ధం కేసులో హైకోర్టు నేడు విచారణ నిర్వహించింది. డా.రమేష్‌బాబును విచారించేందుకు హైకోర్టు అనుమతించింది. మూడు రోజుల పాటు అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫీస్‌లో విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 30 నుంచి డిసెంబర్‌ 2 వరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిర్వహించాలని తెలిపింది. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. 


Read more