అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2020-06-19T19:24:51+05:30 IST

అమరావతి: అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయలేదు.

అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

అమరావతి: అచ్చెన్నాయుడు బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. హైకోర్టులో ప్రభుత్వం కౌంటర్‌ దాఖలు చేయలేదు. ఏ-1 నిందితుడు రమేష్‌కుమార్‌ తరపున కూడా కౌంటర్ దాఖలు కాలేదు. అచ్చెన్న తరపు న్యాయవాది సిద్దార్ధ లూద్రా తమ వాదనలు వినాలని కోర్టును కోరారు. బెయిల్‌ పిటిషన్‌, కస్టడీ పిటిషన్‌పై ఒకేసారి వాదనలు వినాలని సిద్దార్ధ లూద్రా కోరారు. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.


Updated Date - 2020-06-19T19:24:51+05:30 IST