నిమ్మగడ్డ కేసులో జగన్ సర్కార్‌కు హైకోర్టు షాక్

ABN , First Publish Date - 2020-05-29T17:17:33+05:30 IST

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను...

నిమ్మగడ్డ కేసులో జగన్ సర్కార్‌కు హైకోర్టు షాక్

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్‌ ఇచ్చింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌‌ను కొనసాగించాల్సిందేనని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. ఆయనను తొలగిస్తూ జగన్ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్‌‌ను హైకోర్టు కొట్టేసింది. నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ఆర్డినెన్స్ తెచ్చే అధికారం ప్రభుత్వానికి లేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుతో ప్రస్తుతం కమిషనర్ కనగరాజ్ పదవి నుంచి తొలగినట్టేనని నిపుణులు తెలిపారు.   


హైకోర్టు తీర్పుపై బీజేపీ సీనియర్ నేత కామినేని శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ఇవాళ న్యాయవ్యవస్థపై ప్రజలకు ఉన్న నమ్మకం మరింత పెరిగిందన్నారు. బీజేపీ అగ్రనేతలతో మాట్లాడిన తర్వాతే కోర్టులో పిల్ వేశామన్నారు. న్యాయం జరిగినట్టు భావిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలో ఎక్కడో ఒకచోట సమస్యలకు పరిష్కారం దొరుకుతోందన్నారు. వ్యక్తిగత ఎజెండాతో జగన్ పని చేస్తున్నారని విమర్శించారు. 

Updated Date - 2020-05-29T17:17:33+05:30 IST