నేతల కేసుల్లో సాక్షులకు హాని!

ABN , First Publish Date - 2020-12-06T08:59:42+05:30 IST

ప్రజాప్రతినిధులు, నేర నేతలకు సంబంధించిన క్రిమినల్‌ కేసుల్లో సాక్షులకు హాని కలిగే అవకాశం ఉందని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది.

నేతల కేసుల్లో సాక్షులకు హాని!

సాక్షుల పరిరక్షణ పథకం అమలు చేయండి

దీనిపై అవగాహన కల్పించే బాధ్యత సర్కారుదే

2 వారాల్లో కాంపిటెంట్‌ అథారిటీని వేయండి

ప్రత్యేక నిధులు, కోర్టులు కూడా ఏర్పాటు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వానికి కర్ణాటక హైకోర్టు కీలక ఆదేశాలు

శర వేగంగా కేసులు పరిష్కరించాలని సూచనలు


అమరావతి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ప్రజాప్రతినిధులు, నేర నేతలకు సంబంధించిన క్రిమినల్‌ కేసుల్లో సాక్షులకు హాని కలిగే అవకాశం ఉందని కర్ణాటక హైకోర్టు అభిప్రాయపడింది. ప్ర త్యేక న్యాయస్థానాల ముందు పెండింగ్‌లో ఉన్న ఈ కేసుల్లో నేత లు దోషులుగా తేలే అవకాశం ఉందని పేర్కొంది. సుప్రీంకోర్టు ఆమో దించిన సాక్షుల పరిరక్షణ పథకం-2018ను తక్షణం అ మల్లో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనికిగాను 2 వారాల్లో కాంపిటెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని నిర్దేశించిం ది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై ఉన్న క్రిమినల్‌ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేయాలని ఇటీవల సు ప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులను ఆదేశించిన విష యం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్‌ ఓకా, న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.విశ్వజిత్‌ శెట్టిల ధర్మసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కర్ణాటకలోనూ దీనిని తక్షణం అమల్లోకి తేవాలని హైకోర్టు పేర్కొంది. 


బెంగళూరు నుంచే మొదలు

మొదటి దశలో బెంగుళూరు అర్బన్‌ జిల్లాలో కాంపిటెంట్‌ అథారిటీని ఏర్పాటు చేయాలని, తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సాక్ష్యుల పరిరక్షణ పథకాన్ని అమలు చేయాలని ధర్మాసనం సూచించింది. రెండు వారాల్లో ప్రత్యేక నిధులు కేటాయించాలని ఆదేశించింది. పథకంలోని నిబంధనలను దర్యాప్తు అధికారులకు వివరించి, సంపూర్ణంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది.


ప్రత్యేక కోర్టులో కేసులు పర్యవేక్షిస్తున్న దర్యాప్తు అధికారి, సాక్షికి ఏమైనా హాని కలిగే అవకాశం ఉందా? అనే విషయం అంచనా వేయాలని పేర్కొంది. ప్రత్యేక న్యాయస్థానాల్లో ఉన్న కేసులు వాదించేందుకు సమర్థులైన ప్రాసిక్యూటర్లను నియమించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందంది. ప్రాసిక్యూటర్ల నియామక ప్రక్రియను తమ ముందుంచాలంది.

Read more