-
-
Home » Andhra Pradesh » High Court
-
అమరావతి: రాజధాని కేసులపై హైకోర్టులో విచారణ
ABN , First Publish Date - 2020-11-27T19:01:00+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాజధాని కేసులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని కేసులపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. రాజధాని మార్చడం రాజ్యాంగ ధిక్కరమేనని సీనియర్ న్యాయవాది సత్యపసాదరావు వాదనలు వినిపించారు. ఇప్పటికే గత టీడీపీ ప్రభుత్వం రాజధాని అమరావతి అభివృద్ధి కోసం రూ.కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించిందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఆత్మగౌరవంగా భావించే..రాజధానిని మార్చడం సమంజసం కాదన్నారు. కాగా ఇరువైపు వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.