ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు

ABN , First Publish Date - 2020-09-05T08:52:23+05:30 IST

ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ..

ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు

పథకాన్ని నీరుగారిస్తే కఠిన చర్యలు:  సీఎం జగన్‌ ఆదేశాలు 


అమరావతి, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చేలా వ్యవహరించే ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా ప్రభావంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌డె్‌స్కలు ఉండాలని స్పష్టం చేశారు.


రిఫరల్‌ విధానం చాలా సమర్థంగా ఉండాలని, ఎంపానెల్‌ అయిన ప్రతి ఆస్పత్రిలోనూ హెల్ప్‌ డెస్క్‌ కచ్చితంగా ఏర్పాటు చేయాలన్నారు. వైద్యం సరిగ్గా అందడం లేదంటే బాధితులను సరైన ఆస్పత్రికి పంపించే బాధ్యత ఆరోగ్యమిత్రలదేనని పేర్కొన్నారు. ఆధికారులు రోజూ కాల్‌సెంటర్లకు మాక్‌కాల్‌ చేసి పనితీరును సమీక్షించాలని అదేశించారు.  సమీక్షలో ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ నీలం సాహ్ని, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-05T08:52:23+05:30 IST