రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

ABN , First Publish Date - 2020-08-16T16:08:37+05:30 IST

వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది.

రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు

హైదరాబాద్: వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు సూచించారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కి.మీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని అలలు 3.5 నుంచి 4.3 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశం ఉందని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2020-08-16T16:08:37+05:30 IST