ఏపీలో 17 వరకు భారీ వర్షాలు
ABN , First Publish Date - 2020-09-14T11:54:28+05:30 IST
ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఆదివా రం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.
విశాఖపట్నం(ఆంధ్రజ్యోతి): ఉత్తరాంధ్ర తీరంలో బంగాళాఖాతంలో ఆదివా రం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా అదే ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీంతో సోమవారానికి అల్పపీడనం మరింత బలపడే అవకా శం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావం తో ఈనెల 17 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. తూర్పుగోదావరిలో అతిభారీ వర్షాలు, విజయనగరం, విశాఖ, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ భారీగా వర్షాలు కురిశాయి.
కోస్తాలో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపలవేట కు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. కాగా, ఈ నెల 20న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక, కోస్తాలో శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో మెట్ట ప్రాంతం రై తుల్లో ఖరీ్‌ఫపై ఆశలు చిగురించాయి. ఈ వర్షాలు అన్ని రకాల పంటలకు ఎంతో మేలు చేస్తాయని వ్యవసాయ శాఖ అధికారి ఒకరు తెలిపారు.