ఎల్జీ పాలిమర్స్ తరపున మూడుగంటల పాటు విచారణ
ABN , First Publish Date - 2020-05-29T20:30:07+05:30 IST
ఎల్జీ పాలిమర్స్ తరపున మూడు గంటల పాటు విచారణ జరిగినట్టు న్యాయవాది మార్కండేయులు తెలిపారు తానూ నిర్వాసితుల తరపున వాదనలు వినిపించినట్టు తెలిపారు

అమరావతి: ఎల్జీ పాలిమర్స్ తరపున మూడు గంటల పాటు విచారణ జరిగినట్టు న్యాయవాది మార్కండేయులు తెలిపారు తానూ నిర్వాసితుల తరపున వాదనలు వినిపించినట్టు తెలిపారు. ప్రధానంగా ఎల్జీపాలిమర్స్ నిర్వహణకు అనుమతులు ఎవరిచ్చారు? అనే దానిపై వాదనలు సాగాయని అన్నారు కేంద్రం తరపున పర్యావరణశాఖ అధికారులు కూడా ఎటువంటి అనుమతులు తీసుకోలేదని కోర్టుకు తెలిపినట్టు చెప్పారు. కంపెనీ తరపున ముప్పై మందని అనుమతించాలని వారి తరపు న్యాయవాదులు కోరారు. అక్కడ స్టాకు అమ్మేదుకు అనుమతి ఇవ్వాలని లేకుంటే స్టాకు చెడిపోతుందన్నారు. దానిపై న్యాయమూర్తి విచారణ వారం పాటు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. కంపెనీకి అసలు ఏ అనుమతులు ఉన్నాయో కోర్టుకు తెలపలేదని అన్నారు. కేంద్రం, రాష్ట్రం నుంచి ఏమే సమయంలో అనుమతలు ఇచ్చారో వివరాలు ఇవ్వాలని కోరానని, కానీ కంపెనీ ఇవ్వలేకపోయిందని తెలిపారు. హైలెవెల్ కమిటీ రిపోర్ట్ కూడా వచ్చాక వివరాలు వెలుగులోకి వస్తాయని అన్నారు ప్రస్తుతం వారం రోజుల వరకు విచారణ వాయిదా పడిందన్నారు. తదుపరి విచారణలో ముప్పై మందికి అనుమతి ఇవ్వాలా? వద్దా? అనే దానిపై వాదనలు జరిగే అవకాశం ఉందన్నారు.