హెల్త్‌కార్డుల ప్రీమియం మే నుంచే రికవరీ

ABN , First Publish Date - 2020-05-08T11:19:09+05:30 IST

హెల్త్‌కార్డులకు సంబంధించి ప్రభుత్వం పెంచిన ప్రీమియం రికవరీ మే నెల జీతాల నుంచి మినహాయింపు చేస్తూ సవరణ జీఓ ఇవ్వాలని ఏపీ జేఏసీ ,చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

హెల్త్‌కార్డుల ప్రీమియం మే నుంచే రికవరీ

ఏపీ జేఏసీ డిమాండ్‌



అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): హెల్త్‌కార్డులకు సంబంధించి ప్రభుత్వం పెంచిన ప్రీమియం రికవరీ మే నెల జీతాల నుంచి మినహాయింపు చేస్తూ సవరణ జీఓ ఇవ్వాలని ఏపీ జేఏసీ ,చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖర్‌రెడ్డి, సెక్రటరీ జనరల్‌ సీహెచ్‌ జోసఫ్‌ సుధీర్‌బాబు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 54లో డిసెంబర్‌ నెల జీతాల నుంచి మినహాయించాలని మే నెలలో ఉత్తర్వులు విడుదల చేయడం సరైన చర్య కాదన్నారు. ఈ ఐదు నెలల కాలంలో రెండు నెలలు కోవిడ్‌-19 వలన ఆసుపత్రుల్లో ఎలాంటి చికిత్సలు జరగలేదని, ఈహెచ్‌ఎస్‌ స్టీరింగ్‌ కమిటీ ప్రతిపాదనల మేరకు ప్రీమియం పెంచడం వలన ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల నుంచి రూ.200 కోట్లు, మరో రూ.200 కోట్లు ప్రభుత్వం నుంచి వస్తున్నందున అన్నీ రకాల జబ్బులను ఈహెచ్‌ఎస్‌ కార్డు పరిధిలోకి తీసుకురావాని కోరారు. ఈహెచ్‌ఎస్‌ కార్డు ఏటీఎం కార్డులా పనిచేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏపీ జేఏసీ డిమాండ్‌ చేసింది.

Updated Date - 2020-05-08T11:19:09+05:30 IST