కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2020-04-26T00:07:19+05:30 IST
కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 12 జిల్లాలు రెడ్ జోన్‌లోకి వెళ్లాయని చెప్పారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని

అమరావతి: కేంద్రం ఏపీలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని మాజీమంత్రి దేవినేని ఉమ డిమాండ్ చేశారు. 12 జిల్లాలు రెడ్ జోన్‌లోకి వెళ్లాయని చెప్పారు. సీఎం జగన్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి అచ్చోసిన ఆంబోతులా తిరుగుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ నేతల ఊరేగింపులతో కరోనా కేసులు పెరుగుతున్నాయని ఆరోపించారు. రైతుల బాధలు వర్ణనాతీతమని, ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు ఏమయ్యాయి? అని ప్రశ్నించారు. తాడేపల్లి నివాసంలో జగన్ పబ్ జీ గేమ్ ఆడుతున్నారని దేవినేని ఉమ ఎద్దేవాచేశారు.