-
-
Home » Andhra Pradesh » head master over action going viral
-
చర్చనీయాంశంగా రామసింగవరం ప్రధానోపాధ్యాయుడి అత్యుత్సాహం
ABN , First Publish Date - 2020-12-28T19:54:26+05:30 IST
ఏలూరు: ద్వారకా తిరుమల మండలం రామసింగవరం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడి అత్యుత్సాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఏలూరు: ద్వారకా తిరుమల మండలం రామసింగవరం జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడి అత్యుత్సాహం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యే తలారి వెంకట్రావుకు స్వాగతం పలికేందుకు ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను పంపించారు. హైస్కూల్ డ్రెస్‌లోనే ఎమ్మెల్యేకు పూలు జల్లి విద్యార్థులు స్వాగతం పలికారు. స్కూల్ సమయంలో విద్యార్థులను తీసుకెళ్లి పూలు జల్లించుకోవడమేమిటని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.