నువ్వంటే నాకిష్టం!
ABN , First Publish Date - 2020-09-12T09:28:58+05:30 IST
ఆ మహిళా వలంటీరుకు ఆ వైసీపీ చోటా నేత వరసకు పినతండ్రి!.. కానీ.. కామాతురాణాం నభయం నలజ్జ...

- మహిళా వలంటీరుపై వైసీపీ నేత వేధింపులు
- కూతురిలాంటిదాన్నన్నా వినడంలేదు
- ఆమెను ఒప్పించాలని మరో వలంటీరుకూ వేధింపులు
సూళ్లూరుపేట, సెప్టెంబరు 11: ఆ మహిళా వలంటీరుకు ఆ వైసీపీ చోటా నేత వరసకు పినతండ్రి!.. కానీ.. కామాతురాణాం నభయం నలజ్జ... అన్నట్లు అతడు కూతురు వరసైన ఆమెపైనే కన్నేశాడు. ఫోన్‌చేసి వేధిస్తున్నాడు. ఆమె ఫోన్‌తీసి బాబాయ్.. అని సంబోధిస్తే అలా పిలవమాకు.. నువ్వంటే నాకిష్టం.. అని చెప్పేవాడు. ఈ వేధింపులు భరించలేక.. సదరు వైసీపీ నేత ఫోన్‌కాల్‌ను రికార్డు చేసింది. భర్తతోకలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలివీ..
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా సూళ్లూరుపేటకు చెందిన మాజీ కౌన్సిలర్ పొన్నా కాటయ్య ఫోన్‌చేసి లైంగికంగా వేధిస్తున్నాడంటూ అక్కడి రాజీవ్‌నగర్ వలంటీరు కొమ్మల మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. 3మాసాలుగా ఆయన తన వెంటపడుతున్నాడని వాపోయింది. పథకాలు అమలు విషయంలో తనకు చెప్పిచేయాలంటూ ఇబ్బంది పెడుతున్నాడని పేర్కొంది. అదే ప్రాంతానికే చెందిన మరో వలంటీరు ప్రియాంక కూడా.. పొన్నా కాటయ్య అసభ్యంగా మాట్లాడుతున్నాడని, మౌనికకూ తనకూ ‘వారధి’గా ఉండాలంటూ ఇబ్బంది పెడుతున్నాడని ఆక్రోశించింది. ఇలా తమను ఇబ్బంది పెడుతుంటే తాము ఎలా పనిచేయాలంటూ ఆ వలంటీర్లు విలేకరుల వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.