తోటి ట్రాన్స్‌ జెండర్లను వేధిస్తున్న హిజ్రా

ABN , First Publish Date - 2020-12-23T18:07:50+05:30 IST

భీమవరంలో ఓ హిజ్రా తోటి ట్రాన్స్‌ జెండర్లను వేధింపులకు గురిచేస్తోంది.

తోటి ట్రాన్స్‌ జెండర్లను వేధిస్తున్న హిజ్రా

ప.గో.జిల్లా: భీమవరంలో ఓ హిజ్రా తోటి ట్రాన్స్‌ జెండర్లను వేధింపులకు గురిచేస్తోంది. దుర్గాపురానికి చెందిన పోరాపాటి శిల్ప అలియాస్ సిమ్రాన్ అనే హిజ్రా వద్ద అదే ప్రాంతానికి చెందిన 30 మంది ట్రాన్స్‌ జెండర్లు ఆశ్రయం పొందుతున్నారు. అయితే వారు సంపాదించిన సొమ్ము తనకే ఇవ్వాలంటూ వారిని సిమ్రాన్ వేధిస్తోంది. అదేంటని ప్రశ్నిస్తే.. రౌడీలతో కొట్టిస్తోంది. దీంతో వారంతా పోలీసులను ఆశ్రయించారు. ఆ హిజ్రా వల్ల తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పిస్తూ.. న్యాయం చేయాలని కోరుతున్నారు.

Updated Date - 2020-12-23T18:07:50+05:30 IST