9 వేల కోట్లలో సగం బొక్కారు: వీర్రాజు

ABN , First Publish Date - 2020-12-30T07:34:41+05:30 IST

‘అయ్యా జగన్మోహన్‌రెడ్డి.. నువ్వు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే.. అది అప్పులు, అవినీతే’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.

9 వేల కోట్లలో సగం బొక్కారు: వీర్రాజు

సూళ్లూరుపేట, డిసెంబరు 29: ‘అయ్యా జగన్మోహన్‌రెడ్డి.. నువ్వు రాష్ట్రంలో చేసిన అభివృద్ధి ఏదైనా ఉందంటే.. అది అప్పులు, అవినీతే’ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మంగళవారం నిర్వహించిన బీజేపీ సమావేశంలో ఆయన రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ ముఖ్యమంత్రి అప్పులతో పాలన చేస్తూ కాలం గడుపుతున్నారన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయేగానీ, ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏమీ లేదన్నారు. ఇళ్ల స్థలాల పంపిణీకి 9వేల కోట్లు కేటాయించి, సగం బొక్కేశారని ఆరోపించారు. కేంద్రం రాష్ట్రానికి 15 లక్షల ఇళ్లు కేటాయిస్తే, ఈ ప్రభుత్వ చేతకానితనం వల్ల 8 లక్షల ఇళ్లు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. రాష్ట్రంలో ఎర్రచందనం స్మగ్లర్లు వైసీపీ నేతల అనుచరులేనని ఆరోపించారు. ఇసుకనూ దోపిడీ చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగిపోయారని, అందుకే పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం సాధించి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతామన్నారు. ఈ ప్రభుత్వ దోపిడీ విధానాలను ఎండగడుతూ త్వరలో రాష్ట్రవ్యాప్తంగా తమపార్టీ ఉద్యమించనుందని చెప్పారు. 

Updated Date - 2020-12-30T07:34:41+05:30 IST