-
-
Home » Andhra Pradesh » GVMC second list chance political leaders Heirs
-
జీవీఎంసీ రెండో లిస్ట్‌లో ప్రజాపత్రినిధుల వారసులకు చోటు
ABN , First Publish Date - 2020-03-13T16:58:37+05:30 IST
జీవీఎంసీ రెండో లిస్ట్‌లో ప్రజాపత్రినిధుల వారసులకు చోటు

విశాఖపట్నం: వైసీపీ పార్టీ ప్రకటించిని జీవీఎంసీ రెండో లిస్ట్‌లో ప్రజాప్రతినిధుల వారసులకు చోటు లభించింది. భీమిలి నియోజకవర్గంలోని ఆరో వార్డు నుంచి ముత్తంశెట్టి లక్ష్మీ ప్రియాంక బరిలో దిగనున్నారు. అలాగే 74 వ వార్డు నుంచి తిప్పల వంశీ రెడ్డి బరిలో దిగుతున్నారు. కాగా పార్టీకి సేవ చేసిన వారిని విస్మరించారని కొంతమంది వైసిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జీవీఎంసీ రెండో లిస్ట్‌ను వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు ఈ రోజు ఉదయం ప్రకటించారు. జీవీఎంసీలో 98 వార్డులకు గాను 94 వార్డుల అభ్యర్థలను ప్రకటించారు. 47, 8, 13,79 వార్డులను మరికాసేపట్లో ప్రకటించనున్నట్లు దాడి తెలిపారు.