విశాఖ: గో కార్టింగ్‌ను కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు

ABN , First Publish Date - 2020-11-21T14:32:11+05:30 IST

విశాఖలోని మంగమరి పేట వద్ద ఉన్న గో కార్టింగ్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.

విశాఖ: గో కార్టింగ్‌ను కూల్చివేస్తున్న జీవీఎంసీ అధికారులు

విశాఖ: నగరంలోని మంగమరి పేట వద్ద ఉన్న గో కార్టింగ్‌ను జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు. అది టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సన్నిహితుడు కాశీ విశ్వనాథకు చెందినది. ఆయన వైజాగ్ ప్రొఫైల్స్ నుండి పదేళ్ల పాటు లీజుకు తీసుకున్నారు. అయితే అధికారులు కాశీవిశ్వనాథ్‌కు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగిస్తున్నారు. సీఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారుంటూ తొలగిస్తున్నారు.


 ఇది పూర్తిగా ప్రైవేటు భూమని, ప్రభుత్వానికి సంబంధం లేదని కాశీ విశ్వనాథ్ అన్నారు. ప్రభుత్వ భూమి అంటూ ప్రచారం చేస్తున్నారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Read more