3 రాజధానులపై గవర్నర్ నిర్ణయంతో బీజేపీకి సంబంధం లేదు: జీవీఎల్
ABN , First Publish Date - 2020-08-01T09:06:55+05:30 IST
అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ వాంచించిందని, అయితే మూడు రాజధానులపై ..

న్యూఢిల్లీ, జూలై 31(ఆంధ్రజ్యోతి): అమరావతిలోనే రాజధాని ఉండాలని బీజేపీ వాంచించిందని, అయితే మూడు రాజధానులపై గవర్నర్ తీసుకునే నిర్ణయంతో బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాయలసీమలో న్యాయ రాజధాని ఉండాలని బీజేపీ రాష్ట్ర నేతలంతా కలిసి కేంద్రాన్ని అడిగిన మాట వాస్తవమేనన్నారు. హైకోర్టు పెట్టినంత మాత్రాన కర్నూలు రాజధాని అవుతుందని అనుకోవద్దన్నారు. రాయలసీమకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు.