వైసీపీ కక్ష రాజకీయాలకు కోడెల బలయ్యారు: జీవీ ఆంజనేయులు

ABN , First Publish Date - 2020-09-16T18:23:15+05:30 IST

గుంటూరు: జిల్లా టీడీపీ ఆఫీస్‌లో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది.

వైసీపీ కక్ష రాజకీయాలకు కోడెల బలయ్యారు: జీవీ ఆంజనేయులు

గుంటూరు: జిల్లా టీడీపీ ఆఫీస్‌లో మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమం జరిగింది. కోడెల చిత్ర పటానికి గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ తదితరులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జీవీ ఆంజనేయులు మాట్లాడుతూ.. వైసీపీ కక్ష రాజకీయాలకు కోడెల బలయ్యారన్నారు. కోడెలను వైసీపీ అన్యాయంగా బలి తీసుకుందన్నారు. నర్సరావుపేటలో మరుగుదొడ్లను నిర్మించి కోడెల ఆదర్శంగా నిలిచారన్నారు. కొటప్పకొండ దేవాలయాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దారని... టీడీపీకి కోడెల చేసిన సేవలు మరువలేనివని కోడెల పేర్కొన్నారు.

Updated Date - 2020-09-16T18:23:15+05:30 IST