నిందితులను ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా: హర్షకుమార్

ABN , First Publish Date - 2020-12-27T18:15:00+05:30 IST

దళిత యువతి హత్య ... ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్య అని మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు.

నిందితులను ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా: హర్షకుమార్

రాజమండ్రి: దళిత యువతి హత్య ముమ్మాటికీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యేనని మాజీ ఎంపీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆదివారం  దళిత యువతి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ప్రతి కేసులో పోలీసులకు ప్రభుత్వం వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. దళిత యువతిని హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేసే దమ్ముందా అని సవాల్ విసిరారు. వైసీపీ కార్యకర్తలు అండదండలు ఉండటం వల్లే నిందితులను ఎన్‌కౌంటర్ చేయడం లేదని విమర్శించారు. ఘటనపై సీబీఐ విచారణతో పాటు కోటి రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు.

Updated Date - 2020-12-27T18:15:00+05:30 IST