టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నోటీసులు
ABN , First Publish Date - 2020-03-17T02:48:53+05:30 IST
టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు..
గుంటూరు: టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు గురజాల పోలీసులు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేశారు. మాచర్ల దాడి ఘటనపై వాంగ్మూలం నమోదుకు మంగళవారం గురజాల డీఎస్పీ వద్ద హాజరుకావాలని పేర్కొన్నారు. ఆధారాలతో రావాలని సూచించారు. కాగా టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్దా వెంకన్నపై మాచర్లలో వైసీపీ నేత తుర్క కిషోర్ దాడికి పాల్పడ్డారు. అనంతరం కిషోర్ స్టేషన్ బెయిల్‌పై విడుదల అయ్యారు. వైసీపీ తరపున నామినేషన్ కూడా వేశారు. అయితే ఈ దాడి ఘటనపై సీరియస్ అయిన టీడీపీ నేతలు.. రాష్ట్ర డీజీపీతో పాటు గవర్నర్ కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం.