గుంటూరు జిల్లాలో ఆగని వైసీపీ నేతల అరాచకాలు

ABN , First Publish Date - 2020-11-16T00:01:04+05:30 IST

జిల్లాలో వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మునుగోడులో వైసీపీ నేత ఇంటికి రోడ్డు వేసేందుకు ...

గుంటూరు జిల్లాలో ఆగని వైసీపీ నేతల అరాచకాలు

గుంటూరు: జిల్లాలో వైసీపీ అరాచకాలు ఆగడం లేదు. పెద్దకూరపాడు నియోజకవర్గం అమరావతి మండలం మునుగోడులో వైసీపీ నేత ఇంటికి రోడ్డు వేసేందుకు ప్రైవేటు స్థలాన్ని చదును చేస్తున్నారు. గాలీబ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ప్రైవేటు స్థలంలో రోడ్డు వేయడం ప్రారంభించారు. జేసీబీని తీసుకొచ్చి రోడ్డు వేసే పని కూడా మొదలు పెట్టారు. ఇది తమ స్థలం అని చెప్పినా వెనక్కి తగ్గే అవకాశం కనిపించడంలేదు. ఇప్పుడు మునుగోడులో అలజడి నెలకొంది. పురుగు మందుల డబ్బాతో స్థానిక మహిళలు జేసీబీకి అడ్డంగా కూర్చుకున్నారు. అయినా సరే పనులు మాత్రం ఆపడంలేదు. 

Updated Date - 2020-11-16T00:01:04+05:30 IST