గుంటూరులో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
ABN , First Publish Date - 2020-05-24T14:20:42+05:30 IST
గుంటూరులో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ

గుంటూరు: జిల్లాలోని తాడికొండ మండలం ముక్కాలలో వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. జగన్ ఏడాది పాలన సందర్భంగా వైసీపీ శ్రేణులు కేక్ కటింగ్‌కు ఏర్పాటు చేసుకున్నారు. కేక్ కటింగ్ సందర్భంగా వైసీపీలోని రెండు వర్గాల మధ్య వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. ఇరు వర్గాలు పరస్పరం దాడి చేసుకున్నాయి. ఈ దాడిలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.