మద్యం తాగవద్దని భార్య మందలించడంతో...

ABN , First Publish Date - 2020-05-08T16:34:47+05:30 IST

మద్యం తాగవద్దని భార్య మందలించడంతో...

మద్యం తాగవద్దని భార్య మందలించడంతో...

గుంటూరు: మద్యం ఎందుకు తాగావంటూ భార్య మందలించిందన్న కోపంతో భర్త వేడినీటి ఒంటిపై పోసుకున్న ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిలో నివాసం ఉంటున్న దంపతుల మధ్య మద్యం విషయంలో వివాదం చోటు చేసుకుంది. మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తను భార్య మందలించింది.  భార్యపై కోపంతో ఊగిపోయిన భర్త సలసల కాగిన వేడి నీటిని ఒంటిపై పోసుకున్నాడు. దీంతో శరీరం కాలిపోయి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

Updated Date - 2020-05-08T16:34:47+05:30 IST