గుంటూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ కలిసి పోటీ!

ABN , First Publish Date - 2020-03-13T17:05:05+05:30 IST

రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే అంత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీతో టీడీపీ నేతలు భీకరమైన యుద్ధాన్నే సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో...

గుంటూరు జిల్లాలో వైసీపీ-టీడీపీ కలిసి పోటీ!

గుంటూరు: రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ, టీడీపీ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే అంత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అధికార పార్టీ వైసీపీతో టీడీపీ నేతలు భీకరమైన యుద్ధాన్నే సాగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అదికాస్తా తారాస్థాయికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై అధికార పార్టీ నేతలు భౌతికదాడులకు దిగుతున్నారు. టీడీపీ నేతలను ఎన్నికల్లో పోటీ చేయకుండా అన్నిరకాలుగా నిలువరిస్తున్నారు. ఈ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వంతో నేరుగా ఢీకొంటున్నారు. వైసీపీ నేతల అరాచకాలు, ప్రభుత్వ నిర్భందకాండపై న్యాయస్థానాలలో పోరాటం సాగిస్తున్నారు. అయితే ఇదంతా రాష్ట్రస్థాయిలో మనకు కనిపిస్తున్న దృశ్యం. స్థానికంగా పరిస్థితులు మరోరకంగా ఉన్నాయి.


అసలేంజరిగిందంటే.. వైసీపీ ప్రలోభాలకు తలొగ్గారో.. మరెంటో గానీ, పలుచోట్ల అధికార పార్టీ వైసీపీతో పలువురు టీడీపీ నేతలు జట్టుకట్టారు. ఆ పార్టీకి అండగా నిలుస్తున్నారు. జిల్లాలోని వట్టిచెరుకూరు మండలంలో వైసీపీ-టీడీపీ ములాఖత్ అయ్యాయి. ముట్లూరు ఎంపీటీసీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. ఈ ఘటన జిల్లా రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. అయితే వైసీపీతో ములాఖత్ అవటాన్ని ముట్లూరు టీడీపీలోని ఓవర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. జరుగుతున్న పరిణామాలను ఎంపీ జయదేవ్‌ దృష్టికి తీసుకెళ్లారు. టీడీపీని వైసీపీకి అమ్ముకుంటున్నారని మాజీ ఎంపీపీ పూనాటి రమేష్‌పై ఎంపీకి ఫిర్యాదు చేశారు. పరిస్థితులను చక్కదిద్దాలంటూ విజ్ఞప్తి చేశారు. మరి ఎంపీ జయదేవ్ కల్పించుకుని పరిస్థితులను చక్కదిద్దుతారేమో చూడాలి.

Updated Date - 2020-03-13T17:05:05+05:30 IST