గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం

ABN , First Publish Date - 2020-06-04T22:54:25+05:30 IST

బ్లీచింగ్ పౌడర్ బదులు మైదా పిండి వాడుతున్నారు.

గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం

గుంటూరు: బ్లీచింగ్ పౌడర్ బదులు మైదా పిండి వాడుతున్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది నిర్వాకం ఇది. మైదాపిండిలో సున్నం కలిపి రోడ్ల వెంట చల్లుతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుంటూరు సంపత్‌నగర్‌లో మైదాపిండి బస్తాలను స్థానికులు గుర్తించగా రోడ్డుపైనే సిబ్బంది వాటిని వదిలి వెళ్లిపోయారు. గుంటూరు మేయర్ అభ్యర్థి వార్డులోనే ఈ నకిలీ బ్లీచింగ్ బాగోతం వెలుగు చూసింది. 


సుమారు వంద కోట్ల రూపాయలవరకు పిడుగురాళ్ల నుంచి నకిలీ బ్లీచింగ్ పౌడర్ సరఫరా అయినట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది. ఇది మరవముందే గుంటూరు నగరపాలక సంస్థలో గురువారం మధ్యాహ్నం బ్లీచింగ్ పేరుతో మైదాపిండి తెచ్చిన బస్తాలను స్థానికులు గుర్తించారు. దీంతో ఆబస్తాలను అక్కడే వదిలేసి వెళ్లిపోయారు. అయితే తెచ్చినవాళ్లు ఎవరన్నది తెలియలేదు.

Updated Date - 2020-06-04T22:54:25+05:30 IST