లాక్‌డౌన్‌తో గుంటూరులో వలస కూలీ మృతి
ABN , First Publish Date - 2020-04-17T18:12:18+05:30 IST
లాక్‌డౌన్‌తో గుంటూరులో వలస కూలీ మృతి
గుంటూరు: కూలీ పనులకు వచ్చి లాక్‌డౌన్‌తో పనులు లేక, స్వగ్రామానికి వెళ్లలేక ఓ వలస కూలీ తీవ్ర అస్వస్థతకు గురై మరణించిన ఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలో కర్నూలుకు చెందిన వలస కూలీ రంగడు (45) మృతి విషాదాన్ని నింపింది. కొద్దిరోజుల క్రితం పలువురు కూలీలు కర్నూలు జిల్లా నుంచి అచ్చంపేట ప్రాంతానికి కూలీ పనుల నిమిత్తం వచ్చారు. కాగా కరోనా ప్రబలకుండా రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో పనులు లేక కూలీలు స్వగ్రామాలకు పయనమయ్యారు. ఈ క్రమంలో కారంపూడి చెక్‌పోస్ట్ వద్ద కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా తిరుగు ప్రయాణమవగా మార్గమధ్యలో కూలీ రంగడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటి అతడు మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు. మృతుడి స్వస్థలం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడుమరాళ్ళ. విషయం తెలిసిన కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.