-
-
Home » Andhra Pradesh » Guntur Huge scam in the name of bleaching
-
గుంటూరు: బ్లీచింగ్ పేరుతో భారీ కుంభకోణం
ABN , First Publish Date - 2020-05-13T14:14:10+05:30 IST
గుంటూరు: బ్లీచింగ్ పేరుతో భారీ కుంభకోణం

గుంటూరు: కరోనా సమయంలో బ్లీచింగ్ పేరుతో భారీ కుంభకోణం వెలుగుచూసింది. పిడుగురాళ్ల నుంచి రూ.70 కోట్లు పైబడి నకిలీ బ్లీచింగ్ సరఫరా చేసినట్లు తెలుస్తోంది. సున్నానికి వాసన వచ్చే రంగు కలిపి బ్లీచింగ్‌గా అమ్మకాలు చేపట్టారు. పిడుగురాళ్ల నుంచి కాకినాడకు బ్లీచింగ్ సరఫరా జరిగినట్లు సమాచారం. బ్లీచింగ్ సరైంది కాదంటూ కాకినాడ కలెక్టర్ దృష్టికి కింది స్థాయి అధికారులు తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై వెంటనే గుంటూరు కలెక్టర్‌కు కాకినాడ కలెక్టర్ సమాచారం అందజేశారు. దీనిపై విచారణ జరుపగా అసలు పిడుగురాళ్లలో బ్లీచింగ్ తయారీ కంపెనీ లేదని గుర్తించారు. గుంటూరు జిల్లాలో కూడా ఇదే నకిలీ బ్లీచింగ్ సరఫరా అయినట్లు గుర్తించిన కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ విచారణకు ఆదేశించారు. పిడుగురాళ్లలో 2 రోజుల క్రితం సున్నం మిల్లులో అగ్ని ప్రమాదంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.