గుంటూరు డీపీవోపై వేటు

ABN , First Publish Date - 2020-06-11T10:02:45+05:30 IST

నాసిరకం బ్లీచింగ్‌ కొనుగోలు చేసిన వ్యవహారంలో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి రాంబాబుపైౖ

గుంటూరు డీపీవోపై వేటు

విజయవాడ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): నాసిరకం బ్లీచింగ్‌ కొనుగోలు చేసిన వ్యవహారంలో గుంటూరు జిల్లా పంచాయతీ అధికారి రాంబాబుపైౖ సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ విషయాన్ని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. గుంటూరు జిల్లాలో కొనుగోలు చేసిన నాసిరకం బ్లీచింగ్‌కు సంబంధించి ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైంది. దీనిపై విచారణ నిర్వహించిన అధికారులు కరోనా సమయంలో నాసిరకం బ్లీచింగ్‌ను కొనుగోలు చేసినట్టు తేలిందన్నారు. అన్ని జిల్లాల్లో కొనుగోలు చేసిన బ్లీచింగ్‌ను నాణ్యత పరీక్షల నిమిత్తం ప్రయోగశాలలకు పంపామని, నివేదిక వచ్చిన తర్వాతే దానికి సంబంధించిన చెల్లింపులు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. బ్లీచింగ్‌ కొనుగోలుకు మొత్తం రూ.5.90 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఇందులో ఆయా కంపెనీలకు రూ.74.59 లక్షలు మాత్రమే చెల్లించామని తెలిపారు.

Updated Date - 2020-06-11T10:02:45+05:30 IST