గుంటూరు: భర్తకు కరోనా..క్వారంటైన్‌లో భార్య మృతి

ABN , First Publish Date - 2020-06-25T14:41:15+05:30 IST

గుంటూరు: భర్తకు కరోనా..క్వారంటైన్‌లో భార్య మృతి

గుంటూరు: భర్తకు కరోనా..క్వారంటైన్‌లో భార్య మృతి

గుంటూరు: జిల్లాలోని తెనాలి మండలం జగ్గడిగుంటపాలెం  క్వారంటైన్ కేంద్రంలో ఓ మహిళ మృతి చెందింది. గంగానమ్మపేటలో ఈనెల 18న భర్తకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అలాగే ప్రైమరీ కాంటాక్ట్స్‌గా అతడి భార్య, ఇద్దరు పిల్లలను క్వారంటైన్ కేంద్రానికి అధికారులు తరలించారు. ఈ క్రమంలో గత రాత్రి ఒకటిన్నర సమయంలో భార్య గుండెపోటుకు గురై క్వారంటైన్ సెంటర్‌లోనే మృతి చెందింది. వెంటనే అధికారులు ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరోవైపు కరోనా బారిన పడిన భర్త.. ఎన్నారై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Updated Date - 2020-06-25T14:41:15+05:30 IST