అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్ల పట్టివేత

ABN , First Publish Date - 2020-04-07T13:46:44+05:30 IST

గుంటూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గాను అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే.

అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్ల పట్టివేత

గుంటూరు: కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు గాను అన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం కొత్తపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 30మద్యం బాటిళ్లను అచ్చంపేట పోలీసులు పట్టుకున్నారు. ఈ క్రమంలో అక్రమంగా మద్యం తరలిస్తున్న సత్తెనపల్లి‌కి చెందిన లక్కి రెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more