-
-
Home » Andhra Pradesh » Guntur Bapatla Police vs VRO
-
రోడ్డుపై కొట్టుకున్న కానిస్టేబుళ్లు - వీఆర్వో
ABN , First Publish Date - 2020-05-18T17:11:30+05:30 IST
గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో ప్రభుత్వ ఉద్యోగులు నడిరోడ్డుపై ఘర్షణకు దిగడం స్థానికంగా సంచలనం సృష్టించింది.

బాపట్ల: గుంటూరు జిల్లా బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో ప్రభుత్వ ఉద్యోగులు నడిరోడ్డుపై ఘర్షణకు దిగడం స్థానికంగా సంచలనం సృష్టించింది. బైక్ పార్కింగ్ విషయంలో ఈ వివాదం చోటు చేసుకుంది. చివరకు పరస్పరం కేసులు పెట్టుకునే వరకు ఈ వ్యవహారం వెళ్లింది. స్థానిక సమాచారం ప్రకారం.. పెదపులిగురివానిపాలెం వీఆర్వో శివారెడ్డి ఆదివారం కర్లపాలెంలోని ఓ మెడికల్ షాపుకు వచ్చారు. అక్కడ బైక్ పార్క్ చేస్తుండగా కానిస్టేబుల్ అడ్డుకున్నారు. దీనిపై ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. చినికి చినికి గాలివానగా మారింది. కానిస్టేబుల్‌కి తోడుగా మరికొందరు కానిస్టేబుళ్లు తోడయ్యారు. పోలీసులు, వీర్వో కొట్టుకునేంత వరకు వెళ్లింది. నడిరోడ్డుపై ప్రభుత్వ శాఖల సిబ్బంది ఘర్షణకు దిగడం పలువురిని విస్మయానికి గురిచేసింది. ఘటనపై పోలీసులు, వీర్వో పరస్పరం కేసులు పెట్టుకున్నారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.