గుంటూరులో మాజీ సర్పంచ్‌పై దాడి

ABN , First Publish Date - 2020-06-19T19:15:06+05:30 IST

గుంటూరులో మాజీ సర్పంచ్‌పై దాడి

గుంటూరులో మాజీ సర్పంచ్‌పై దాడి

గుంటూరు: జిల్లాలోని వినుకొండ మండలం కొప్పుకొండ మాజీ సర్పంచ్ పసుపులేటి నాగేశ్వరరావుపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గత రాత్రి ఇంటి ముందు నిద్రిస్తుండగా నాగేశ్వరరావుపై ప్రత్యర్థులు దాడికి ఒడిగట్టారు. తీవ్రంగా గాయపడిన నాగేశ్వరరావు వినుకొండ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పాత కక్ష్యల నేపథ్యంలో దాడి చేసినట్లు నాగేశ్వరరావు చెబుతున్నారు. తన ప్రత్యర్థులు కోలా నాగేశ్వరరావు కుటుంబం తనను హత్య చేసే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

Updated Date - 2020-06-19T19:15:06+05:30 IST