ఇసుక మాఫియా అరాచకంపై యువకుడి పోస్ట్...నేతల వేధింపులు

ABN , First Publish Date - 2020-05-30T18:01:57+05:30 IST

ఇసుక మాఫియా అరాచకంపై యువకుడి పోస్ట్...నేతల వేధింపులు

ఇసుక మాఫియా అరాచకంపై యువకుడి పోస్ట్...నేతల వేధింపులు

గుంటూరు: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో ఇసుక మాఫీయా అరాచకానికి పాల్పడింది. కృష్ణా నదిలో నదిని పూడ్చిన మాఫియా ఆ ప్రాంతంలో రోడ్డు వేసింది. కాగా ఈ దారుణాన్ని ప్రశ్నించిన యువకుడి పట్ల అధికారపార్టీ నేతలు కన్నెర్ర చేశారు.  బెల్లంకొండ మండలం నాగారెడ్డిపాలెం వాసి అయిన ఈమని వెంకటేశ్వరరావు అనే యువకుడు కృష్ణా నదిలో వేసిన రోడ్డును వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దీంతో యువకుడిపై అధికార పార్టీ నేతలు కన్నెర్ర చేశారు. గత వారం రోజులుగా యువకుడిని బెల్లంకొండ పోలీసులు వేధింపులకు గురిచేశారు. ఎఫ్‌ఐఆర్ నమోపదు చేయకుండ రోజూ స్టేషన్‌కు పిలిపిస్తూ వేధించారు.  కాగా అధికార పార్టీ నేతల బెదిరింపులతో యువకుడి కుటుంబసభ్యులు కూడా నోరు మెదపని పరిస్థితి నెలకొంది. మరోవైపు యువకుడుపై వేధింపులు ఆపాలంటూ న్యాయవాది మాగులూరి హరిబాబు డిమాండ్ చేశారు. 


ఇసుక మాఫియాపై యువకుడి పోస్టు...‘‘గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం కృష్ణానది పరివాహక ప్రాంతంలో వైసీపీ ఎమ్మెల్యే నంబూరి శంకరరావు అనుచరుల ఇసుక మాఫియా. ముత్తాయపాలెం గ్రామం వద్ద కృష్ణానది గర్భంలో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట. భారీ యంత్రాలతో ఇసుకను తోడేస్తున్న ఇసుకాసులు. దిగువ ప్రాంతమైన విజయవాడ వరకు తాగునీటికి కటకట. చోద్యం చూస్తున్న అధికారులు’’ అంటూ యువకుడు పోస్ట్ చేశాడు. 


Updated Date - 2020-05-30T18:01:57+05:30 IST