గుంటూరులో అఖిలపక్ష రైతు సంఘాల ఆందోళన

ABN , First Publish Date - 2020-09-25T18:14:34+05:30 IST

వ్యవసాయ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ జిల్లాలో అఖిల పక్ష రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి.

గుంటూరులో అఖిలపక్ష రైతు సంఘాల ఆందోళన

గుంటూరు: వ్యవసాయ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ జిల్లాలో అఖిల పక్ష రైతు సంఘాలు ఆందోళనకు దిగాయి. వ్యవసాయ శాఖ కమీషనర్ కార్యాలయం ముందు రైతు సంఘం నేతలు రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ నేతలు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. వెంటనే అక్కడకు చేరుకుని నగరంపాలెం పోలీసులు ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-09-25T18:14:34+05:30 IST