గుంటూరులో మిస్టరీగా మారిన బాలుడి అదృశ్యం
ABN , First Publish Date - 2020-09-20T16:15:40+05:30 IST
జిల్లాలోని నాదెండ్ల మండలం గోరిజవోలులో బాలుడి అదృశ్యం మిస్టరీగా మారింది.

గుంటూరు: జిల్లాలోని నాదెండ్ల మండలం గోరిజవోలులో బాలుడి అదృశ్యం మిస్టరీగా మారింది. ఈ నెల 17 నుంచి తన బిడ్డ యశ్వంత్ (8) కనిపించడం లేదని పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు గ్రామ పరిసరాలలో గాలింపు చేపట్టారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో ఏదైనా జరిగి ఉండచ్చని గ్రామస్తులు చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన నాటి నుంచి తల్లి మేనమామ కనిపించకుండాపోయాడు. దీంతో మేనమామ వీరాస్వామిపైనే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.